ఆయనే నా స్ఫూర్తి.. వాలెంటైన్ ఈవెంట్‌లో వరుణ్

by Disha Web Desk 7 |
ఆయనే నా స్ఫూర్తి.. వాలెంటైన్ ఈవెంట్‌లో వరుణ్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఐదేళ్ల క్రితం పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్ నటిస్తుండగా.. రుహాణిశర్మ, నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 1 న థియేటర్లలో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక యాక్టర్ అవ్వడానికి కారణం మా పెద్దనాన్నే. ఆయన ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా నా వెనుకే ఉండి నడిపించారు. మన మెగాస్టార్ చిరంజీవి, పద్మవిభూషన్ ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మీరు రావడం, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా బాగా పెంచారు, కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారు. ఇలాంటి గ్రేట్ అడ్వైజ్‌తో పాటు మాకు ఇంత మంది మెగా ఫ్యాన్స్‌ను కూడా ఇచ్చారు. ఈ మెగా ఫ్యాన్స్ మమ్మల్నీ ఓ వెన్నుముకల కాపాడుతున్నారు’ అంటూ చెప్పుకొస్తూనే.. సాయుధ బలగాలపై సినిమా చేయడం నాకు గర్వంగా ఉందని తెలిపాడు వరుణ్.


Next Story

Most Viewed