ఆల్ సెట్.. డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా ప్రిన్స్

by sudharani |
ఆల్ సెట్.. డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా ప్రిన్స్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైలీ యాంటిసిపేటెడ్ పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. ప్రజెంట్ వరుణ్ తేజ్, ఫైటర్స్‌తో కూడిన చాలా కీలకమైన, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు వరుణ్ సినిమా నుంచి వరుణ్ తేజ్ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ది గేమ్ ఈజ్ సెట్.. నవంబర్ 14, 2024న వచ్చేస్తున్నాం’ అని సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. రెట్రో అవతార్‌, సూట్‌లో సిగరెట్ కాలుస్తూ మెట్లపై నడుస్తూ వస్తున్న వరుణ్ లుక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ అవతార్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్‌లో వరుణ్ వైవిధ్యమైన లుక్స్ అదరగొట్టాయి. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Advertisement

Next Story

Most Viewed