National Awards ల్లో Mega Heros జోష్.. మొత్తం ఎన్ని కొల్లగొట్టారో తెలుసా?

by Disha Web Desk 2 |
National Awards ల్లో Mega Heros జోష్.. మొత్తం ఎన్ని కొల్లగొట్టారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమాలకు పంట పండింది. మొత్తం 10 అవార్డులు తెలుగు సినిమాలకు దక్కాయి. వాటిలో ఒక్క RRR సినిమాకే ఆరు అవార్డులు దక్కడం విశేషం. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం RRRకు పలు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన ఫీచర్ ఫిలిం, ప్రేమ్ రక్షిత్‌కు ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారం, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం, యాక్షన్ కొరియోగ్రఫీకి గాను యాక్షన్ డైరెక్టర్ కింగ్ సాలమన్‌కు అవార్డు దక్కింది. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో ఎమ్ఎమ్ కీరవాణికి అవార్డు దక్కింది.

ఇక, మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’కు ఉత్తమ తెలుగు చిత్రంగా జ్యూరీ ఎంపిక చేసింది. అంతేకాదు.. వైష్ణవ్ తేజ్ నటించిన మరో సినిమా కొండపొలంలో చంద్రబోస్ రాసిన ‘ధమ్ ధమ్ ధమ్’ పాటకు సాహిత్య పురస్కారం దక్కింది. ఇటీవలే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్.. ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అయితే, ఈ అవార్డుల్లో మెగా హీరోలు సత్తా చాటడంపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ నటించిన పుష్ప, వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రాలకు అవార్డులు వరించడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెబుతూ సంబురపడిపోతున్నారు. ఇక తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించిన మెగా హీరో, డైరెక్టర్


Next Story

Most Viewed