గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన ఆసక్తికర కామెంట్స్

by Disha Web Desk 6 |
గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్లయిన 11 ఏళ్లకు ఓ పాపకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లిన్‌కారా అని నామకరణం చేశారు. అయితే రామ్ చరణ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఉపాసన క్లీన్ కారా చూసుకుంటూనే అపోలో ఆసుపత్రికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

తాజాగా, ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన తన రెండో ప్రెగ్నెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల ఇష్టం. నేను పిల్లలను ఆలస్యంగా కనాలనుకున్నాను. నా పక్కనున్న మేడమ్ కూడా లేట్‌గానే పిల్లలను కనాలనుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు అది నా ఇష్టం. అంతేకాదు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కి కూడా రెడీగా ఉన్నాను.

మీ పెయిన్ మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్యామిలికీ అర్థమవుతుంది. మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. మనల్ని మనం పట్టించుకోవాలి. ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరయ్యాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed