శ్రీలీలను కూడా సైడ్ చేస్తున్న యంగ్ హీరోయిన్.. వరుస అవకాశాలతో దూసుకెళ్తుందిగా..

by Anjali |
శ్రీలీలను కూడా సైడ్ చేస్తున్న యంగ్ హీరోయిన్.. వరుస అవకాశాలతో దూసుకెళ్తుందిగా..
X

దిశ, సినిమా: హీరోయిన్ మీనాక్షీ చౌద‌రి.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ర‌ష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి భామ‌లు ముంబైలో తిష్ట వేయ‌డం.. స‌మంత అమెరికాలో రిలాక్స్ అవ్వడంతో ద‌ర్శకనిర్మాతల చూపు ప్రస్తుతం మీనాక్షిపై పడింది. ముఖ్యంగా ఈ అమ్మడు ‘గుంటూరు కారం’ మూవీలో మ‌హేష్‌కు జోడీగా నటిస్తుండటంతో మ‌రింత పాపుల‌ర్ అవుతుంది. ఇక ఇదే క్రేజ్‌ను తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటున్న మీనాక్షి.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలకు క‌మిట్ అవుతుంది. ఇందులో భాగంగా తాజాగా మ‌రో భారీ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నట్లు సమాచారం.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మొత్తం ముగ్గురు నాయిక‌లు కావాల్సి ఉంది. ఇప్పటికే త్రిష, ఊర్వశీ రౌతేలా పేర్లు వినిపించగా.. తాజాగా మీనాక్షి కూడా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మీనాక్షి స్టార్ హోదా పొందేందుకు ఎంతో దూరం లేనట్లే. ఓవైపు ‘గుంటూరు కారం’.. మ‌రోవైపు బాల‌య్య సినిమాలో రొమాన్స్ చేస్తే.. అంత‌కు మించిన ఫేమ్ ఇంకేం ఉంటుందంటున్న విశ్లేషకులు.. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయితే శ్రీలీలను సైతం పక్కకు నెట్టేస్తుందని అంటున్నారు.

Next Story

Most Viewed