" మట్టీ కుస్తీ " సినిమా మొత్తానికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది !

by Prasanna |
 మట్టీ కుస్తీ   సినిమా మొత్తానికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది !
X

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా " మట్టి కుస్తీ ". ఈ సినిమాలో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవి తేజతో కలిసి విష్ణు విశాల్, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా కలిసి ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంగా నిర్మించారు.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడదల అయ్యింది.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలను అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. మొదటి రోజు.. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా క్లోజింగ్ రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 0.31 Cr

సీడెడ్ - రూ 0.18 Cr

ఏపీ + తెలంగాణ - రూ 0.29 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ0.78 Cr

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.9 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.0.78 కోట్ల షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసి తెలుగులో ఫ్లాప్‌గా మిగిలింది.

ఇవి కూడా చదవండి : " గుర్తుందా శీతాకాలం " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

Next Story