Guntur Kaaram : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మాస్ సాంగ్ లీక్..!

by Hamsa |
Guntur Kaaram : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మాస్ సాంగ్ లీక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. దీనికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, రేఖ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల మేకర్స్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా, సోషల్ మీడియాలో గుంటూరు కారం మొదటి పాట ఇదే అంటూ ఓ ఆడియో వైరల్‌గా మారింది. గుంటూరు కారం సాంగ్ లీక్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ ఆడియోను కొందరు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ తమన్ ఎప్పటిలాగే పాత మ్యూజిక్ కాపీ కొట్టాడని ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఇది నిజం పాట కాదని అంటున్నారు. ఇక ఇది నిజమో కాదో తెలియాలంటే మూవీ మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చేదాక ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సాంగ్ మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Next Story

Most Viewed