నేను అందుకే ఆ సినిమాలో చెయ్యలేదు.. ‘కన్నప్ప’పై మంచు లక్ష్మీ కామెంట్స్ వైరల్

by sudharani |
నేను అందుకే ఆ సినిమాలో చెయ్యలేదు.. ‘కన్నప్ప’పై మంచు లక్ష్మీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది లక్ష్మీ ప్రసన్న. తర్వాత పలు సినిమాలు తీసిన ఆమె.. తన నటనతో, టాకింగ్ స్టైల్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ మేరకు అజయ్, వేదిక, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 14 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాను ‘కన్నప్ప’ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పుకొచ్చింది లక్ష్మి.

కన్నప్పలో మీరు ఎందుకు నటించడం లేదనే ప్రశ్న ఎదురుకాగా.. ఆమె మాట్లాడుతూ.. ‘నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. నాకు తెలిసి అందులో నాకు సరిపోయే పాత్ర ఉండి ఉండదు. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు. ఇందులో మనోజ్ కూడా నటించడం లేదు. ఒకవేళ నేను, మనోజ్ అందరం ఉంటే.. ఇది మా ఫ్యామిలీ సినిమా అయిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో.. మెహన్ బాబుతో సహా పలువురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story