తాగడానికి వెళ్లిన హీరో శర్వానంద్.. ఇంటికొచ్చేసరికి భార్య, కొడుకు పరిస్థితి దారుణం..

by Dishafeatures3 |
తాగడానికి వెళ్లిన హీరో శర్వానంద్.. ఇంటికొచ్చేసరికి భార్య, కొడుకు పరిస్థితి దారుణం..
X

దిశ, సినిమా : శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ' మనమే '. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫీల్ గుడ్టీజర్ రిలీజ్ కాగా.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటున్నారు నెటిజన్లు. ఈ సారి శర్వా పక్కా హిట్ కొడుతాడని ఖుష్ అవుతున్నారు అభిమానులు.

మంచి వాడిలా కనిపించే చెడ్డోడిని అని చెప్పుకు తిరిగే హీరో.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండానలే హీరోయిన్ కు మధ్యలో ఓ బుడ్డోడు ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది అనేది కథ. కాగా హీరోకు చిన్న పిల్లాడిని ఇచ్చి వెళ్తే వచ్చేసరికి ఒక్కడే ఇంట్లో ఏడుస్తూ ఉంటాడు. వాడిని వదిలి ఎటు వెళ్లావు అని ప్రశ్నిస్తే మందు తాగడానికి బయటకి వెళ్లానని బాధ్యత లేని సమాధానం చెప్తాడు. దీంతో ఆమె కూడా ఏడుపు మొదలుపెట్టగా.. ఇద్దరిలో ఒకరే ఏడ్వండి, ఒకేసారి ఇద్దరు వద్దు అని చెప్తున్న డైలాగ్ హైలెట్. కాగా అల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్.


Next Story

Most Viewed