నటి నిత్య అరెస్ట్.. 75ఏళ్ల వృద్ధుడి హనీ ట్రాప్.. రూ.11లక్షలు ముట్టజెప్పినా తగ్గని బెదిరింపులు..

by Disha Web Desk 7 |
నటి నిత్య అరెస్ట్.. 75ఏళ్ల వృద్ధుడి హనీ ట్రాప్.. రూ.11లక్షలు ముట్టజెప్పినా తగ్గని బెదిరింపులు..
X

దిశ, సినిమా : మలయాళం యాక్ట్రెస్ నిత్య సాయి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయింది. తన ఫ్రెండ్ బినుతో కలిసి.. 75ఏళ్ల ఎక్స్ ఆర్మీ మ్యాన్‌ను న్యూడ్ ఫొటోస్ లీక్ చేస్తామని బెదిరించింది. రూ. 25 లక్షలు ఇస్తేనే ఈ న్యూస్ బయటకు తెలియకుండా ఉంటుందని బ్లాక్‌మెయిల్ చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హౌజ్ రెంట్ కోసం వృద్ధుడిని కాంటాక్ట్ అయిన నిత్య సాయి.. తర్వాత అతనితో క్లోజ్ అయిందని చెప్పుకొచ్చారు.

అతని ఒంటిపై దుస్తులు లేకుండా చేసి.. ఆయనతో ఫొటోలు దిగిందని, అవే ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించిందని తెలిపారు. దీంతో భయపడిపోయిన వృద్ధుడు ఇప్పటికే రూ. 11లక్షలు కూడా ముట్టజెప్పాడని.. చివరకు చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించాడని వివరించారు. ఇక ఈ కేసులో నిత్యసాయి ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ కాగా.. ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed