ఆ నిర్ణయమే నా జీవితాన్ని కష్టాలపాలు చేసింది: కన్నీరు పెట్టుకున్న నటి

by sudharani |
ఆ నిర్ణయమే నా జీవితాన్ని కష్టాలపాలు చేసింది: కన్నీరు పెట్టుకున్న నటి
X

దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ మలైకా అరోరా ఒడిదొడుకుల జీవితాన్ని తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్‌ లైఫ్ మీద సెటైర్స్ వేసుకున్న నటి విడాకుల గురించి కూడా ఓపెన్ అవుతూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం తాను హోస్ట్ చేస్తున్న 'Moving in with Malaika' రియాలిటీ షో ప్రోమో తాజాగా రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇందులో తన గురించిన అన్ని విషయాలు ముక్కూసూటిగా చెప్పేస్తానన్న నటి.. 'నేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను కాదు మోస్ట్ లవబుల్ స్టార్ అంతకన్నా కాదు.

యూత్ ఐకాన్ అనే మాట అస్సలు సెట్ కాదు' అంటూ ఆకస్తికరంగా మాట్లాడింది. అలాగే దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా హీరోయిన్స్ రోల్స్ వైపు చూడకుండా ఐటమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేస్తున్న ఆమె ఇటీవల రియాలిటీ షోలకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా మాట్లాడింది. చివరగా ఏదో ఒకరకంగా సోషల్ మీడియాలోనూ తన అభిమానులను అలరిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ఇక ఈ షోలో మలైకాకు మద్దతుగా నటి కరీనా కపూర్, చిత్రనిర్మాత ఫరా ఖాన్ కూడా కనిపించారు

Next Story

Most Viewed