మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్..!

by Hamsa |
మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల నటించిన గుంటూరు కారం చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెప్సాన్స్‌ను దక్కించుకుంటుంది. అయితే సూపర్ స్టార్ తన తదుపరి చిత్రం రాజమౌళితో చేస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

SSMB 29 అనే పేరుతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ఆస్కార్ విన్నర్ ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు ఈ సినిమా కోసం జపాన్‌కు వెళ్లి వచ్చాడు. అంతేకాకుండా పూర్తిగా ఆయన స్టైల్‌ను కూడా మార్చేశాడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని రూపొందిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

స్క్రిప్ట్ పూర్తి అయింది. తొందరలో షూటింగ్ కూడా జరుపుకుంటుందని అన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రాజమౌళి- మహేష్ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. SSMB29 సినిమాకు ‘మహారాజా’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తొందరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి ఫ్లాప్ కాకుండా చూసుకోమని అంటున్నారు.

Next Story

Most Viewed