బాలీవుడ్ ‘రామాయణం’ లో దశరథ మహారాజు పాత్ర కోసం దిగ్గజ నటుడు..!

by Dishafeatures1 |
బాలీవుడ్ ‘రామాయణం’ లో దశరథ మహారాజు పాత్ర కోసం దిగ్గజ నటుడు..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించనున్న తాజా చిత్రం ‘రామాయణం’. ఇతిహాసం రామాయణం ఆధారంగా మూడు భాగాలు తెరకెక్కించనున్న ఈ మూవీ లో శ్రీరాముడిగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ చేస్తారని టాక్. కానీ ఈ వివరాలను మూవీ టీమ్ వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రంలో శార్పనఖ పాత్ర కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‍‌ని కన్ ఫామ్ చేయగా తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు కీలక పాత్ర పోషించనున్నారనే సమాచారం బయటకు వచ్చింది.

శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడట. కానీ దీని గురించి మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‍లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ పూర్తయ్యాక ఆమె ‘రామాయణం’ షూటింగ్‍కు వెళనుందట. అయితే మూడు భాగాలుగా రాబోతున్న ఈ ‘రామయణం’ మొదటి భాగాన్ని 2025 దీపావళికి రిలీజ్ చేసేలా నితేశ్ తివారీ ప్లాన్ చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.Read Disha E-paper

Next Story

Most Viewed