గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. పెళ్లి చేసుకునే వారికి భారీ సాయం..

by Disha Web Desk 6 |
గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. పెళ్లి చేసుకునే వారికి భారీ సాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగా, హీరోగా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే ఇటీవల చంద్రముఖి-2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లారెన్స్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో ‘జిగర్ తిండ డబుల్ ఎక్స్‌’లో ప్రధాన పాత్రలో నటించారు. దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్‌లో పాల్గొన్న లారెన్స్ తన ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘విడుదలైన ప్రతిసారి అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ఈసారి మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలోనే నిర్మించబోతున్నాను.

ఈ కార్యక్రమ్ ఎందుకు చేస్తున్నానంటే.. ఇంతకు ముందు నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇస్తూ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి ఎక్కడ అని అడిగితే.. ఇంట్లోనే కానీ సరైన వసతి లేదు. కళ్యాణమండపంలో చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదు అన్నాడు. పెళ్లి సమయంలో అతని ముఖంలో సంతోషం లేదు. అందుకే మా అమ్మ పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసిన లారెన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.Next Story