కాంట్రవర్సియల్ చిత్రంతో రాబోతున్న మెగా కోడలు.. సూసైడ్ హీరోయిన్ బయోపిక్‌లో?

by Anjali |   ( Updated:2024-02-21 02:16:15.0  )
కాంట్రవర్సియల్ చిత్రంతో రాబోతున్న మెగా కోడలు.. సూసైడ్ హీరోయిన్ బయోపిక్‌లో?
X

దిశ, సినిమా: టాలీవుడ్ లొట్ట చెంపల హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలైనప్పటి నుంచి తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంది. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ మిస్టర్ సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో వీరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గత ఏడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.

బ్యూటిఫుల్ లావణ్య మెగా కోడలిగా స్థానం దక్కించుకుని.. పెళ్లాయ్యాక మరిన్ని సినిమా అవకాశాలు సంపాదించుకుంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ హీరోయిన్‌కు మరో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కాంట్రవర్సీయల్ కంటెంట్‌తో లావణ్య ప్రేక్షకుల ముందుకు రానుందట.

ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. వివాదంగా మారిన దివంగత హరోయిన్ ప్రత్యూష బయోపిక్‌లో మెగా కోడలు నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రత్యుష మరణానికి సంబంధించిన కీలక విషయాలను చూపించబోతున్నారట. కాంట్రవర్సియల్ సినిమా అయినప్పటికి లావణ్య ఈ మూవీలో నటించడానికి యాక్సెప్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు కానీ.. నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.



Next Story

Most Viewed