మన దేశంలో స్త్రీలకు ఆరోగ్య సంరక్షణ లేదు.. Lara Dutta

by Disha Web Desk 7 |
మన దేశంలో స్త్రీలకు ఆరోగ్య సంరక్షణ లేదు.. Lara Dutta
X

దిశ, సినిమా : భారతదేశంలోని మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ లేదని భావిస్తున్నట్లు నటి లారా దత్తా తెలిపింది. ఇటీవల రుతువిరతి అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆమె.. మన దేశంలో ముఖ్యంగా పునరుత్పత్తికి సంబంధించి సరైన ప్రాధాన్యత లేదని పేర్కొంది. ఇక రుతువిరతి.. స్త్రీ రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందన్న ఆమె.. విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ ఈ అంశం గురించి సంభాషణలు పరిమితంగానే ఉండటం బాధాకరమని తెలిపింది.

'నేను ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పిన పాఠాలు నా కళ్లు తెరిపించాయి. మహిళల ఆరోగ్యం, వెల్‌నెస్ గురించి చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. దురదృష్టవశాత్తు మన దేశంలో మెజారిటీ స్త్రీలకు సరైన శారీరక, వైద్య ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. పెద్ద ఫార్మా కంపెనీలు నేడు ఈ కార్యక్రమాలను చేపట్టడం, సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం నిజంగా అద్భుతం. ఇలాంటి అంశాలపై ప్రదర్శనలు, చలనచిత్రాలు ఖచ్చితంగా రూపొందించబడాలి' అంటూ చెప్పుకొచ్చింది.

Next Story