రెడ్ లెహంగాలో కృతి శెట్టి అందాలు అదరహో.. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతి పోగొట్టేసిందిగా!

by Hamsa |
రెడ్ లెహంగాలో కృతి శెట్టి అందాలు అదరహో.. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతి పోగొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలాగే తన నటన, అందంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి కి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ వరుసగా మూడు నాలుగు ఫ్లాప్స్ రావడంతో క్రేజ్ పడిపోయింది.

దీంతో ఈ అమ్మడుకి ఆఫర్లు తగ్గిపోయాయి. అడపా దడపా అవకాశాలు వస్తుండటంతో కృతి సినీ కెరీర్ డైలమాలో పడిపోయింది. అయితే బేబమ్మ గత ఏడాది నాగచైతన్య కస్టడీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కృతి శర్వానంద్ మనమే సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో.. తాజాగా, బేబమ్మ రెడ్ కలర్ లెహంగాలో మత్తెక్కించే చూపులతో యూత్ మతిపోగొట్టేసింది. నడుము అందాలు చూపిస్తూ అదరహో అనిపిస్తుంది. దీంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Next Story

Most Viewed