- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నటుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కిర్తీ సురేష్.. తల్లి షాకింగ్ రియాక్షన్!

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ అమ్మడు మహానటి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇటీవల వచ్చిన దసరా ఊహించని రేంజ్‌తో విజయం అందుకుని ఆమె పాపులారిటీ మరింత పెరిగేలా చేసింది.
అయితే కిర్తీ సురేష్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె పెళ్లికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే నటుడు సతీష్‌ను పెళ్లి చేసుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, వాటిపై నటుడు సతీష్ స్పందించాడు. ‘‘ భైరవ చిత్రంలో కీర్తీ సురేష్‌తో నటించాను. షూటింగ్ జరిగే ముందు పూజా కార్యక్రమాలు చేశారు. అప్పుడు అక్కడ ఉన్న వారందకు పూల మాలలు వేసుకున్నారు.
కానీ మా ఇద్దరి ఫొటోలు నెట్టింట పెట్టి మేము సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు రాశారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ సమయంలోనే కీర్తి అమ్మగారు నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ అల్లుడుగారు అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది. వారు అలాంటి పుకార్లను పట్టించుకోరని. ఆ తర్వాత కూడా చాలా సార్లు అలాంటి పుకార్లు వచ్చారు. ఈ నేపథ్యంలో నేను పెళ్లి చేసుకోవడంతో అలాంటి వార్తలు రావడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, సతీష్ కమెడియన్‌గా నటుడిగా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగులో నయనతార ప్రధాన పాత్రలో నటించి రాజా రాణి సినిమాలో సతీష్ ప్రెండ్‌గా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు.