- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్ స్వింగ్‌లో ‘కింగ్-100’ షూటింగ్..ఆ తేదీకే థియేటర్స్‌లో సందడి చేయబోతోన్న నాగార్జున!
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20కి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

దిశ, సినిమా: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇప్పటికీ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన కొడుకులు అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య కంటే యంగ్‌గా కనిపిస్తూ.. ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇకఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో టబు కీలక పాత్రలో నటిస్తోంది. నాగార్జునకు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా కనిపించనుంది. యాక్షన్ డ్రామా ఎమోషన్స్ కలిపి దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ సైలెంట్‌గా దూసుకెల్తోంది. అంతేకాకుండా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
త్వరలోనే చీత్రీకరణ పూర్తి చేస పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సోలో తేదీతో పాటు స్పెషల్‌గా థియేటర్స్‌లోకి తీసుకురావాలని మూవీ మేకర్స్ చూస్తున్నారట. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20కి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్డేట్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






