ఇండస్ట్రీలో 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సుదీప్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 17 |
ఇండస్ట్రీలో 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సుదీప్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ స్టార్ అయినప్పటికీ 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన 'విక్రాంత్ రోణా' ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో 'రా.. రా రక్కమ్మ' అనే పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాటకు ఓ మహిళ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అసలు విషయమేమిటంటే.. సుదీప్ ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో SS రాజమౌళి, సుదీప్ గురించి చెప్పిన 'ఈ రోజు వరకు నా బెస్ట్ విలన్ సుదీప్' అనే మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed