బెడ్ రూమ్ సీక్రెట్స్ అన్నీ లీక్ చేసిన హీరోయిన్.. భర్తతో ఏం చేస్తుందో కూడా చెప్పేసింది...

by Disha Web Desk 7 |
బెడ్ రూమ్ సీక్రెట్స్ అన్నీ లీక్ చేసిన హీరోయిన్.. భర్తతో ఏం చేస్తుందో కూడా చెప్పేసింది...
X

దిశ, సినిమా : ‘కాఫీ విత్ కరణ్’ షో ఎప్పుడూ సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్‌నే టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ కరణ్ జోహార్.. గెస్ట్‌గా వచ్చిన కియారా అద్వానీ వ్యక్తిగత అంశాల గురించి బయటకు లాగాలనే ప్రయత్నం చేశాడు. ‘బెడ్ రూమ్‌లో పడుకునేందుకు ఏ వస్తువులు ఉపయోగిస్తావు?’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానమిచ్చిన బ్యూటీ.. ‘దుప్పటి, తలగడ, మా ఆయన’ అని చెప్పింది. ‘నేను ఎప్పుడూ కౌగిలించుకుని పడుకునేందుకు ఇష్టపడుతుంటా. నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రాను హగ్ చేసుకునే నిద్రిస్తా’ అని సిగ్గుపడుతూ తెలిపింది. ఇక ఈ ఆన్సర్ విన్న కో-గెస్ట్ విక్కీ కౌశల్ హై-ఫై ఇచ్చి నవ్వేశాడు.

కాగా చాలా కాలంగా సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపిన కియారా.. ‘షేర్షా’ మూవీ టైమ్‌లో చాలా యూనిక్‌గా, సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేశాడని తెలిపింది. ఆ తర్వాత తాను కొన్నిసార్లు వాళ్ల ఇంటికి వెళ్లాలని.. అప్పుడు సిద్ధు మమ్మీని ఆంటీ అని పిలిస్తే, మామ్ అని పిలవాలని సూచించినట్లు చెప్పింది. కానీ తన పేరెంట్స్ యంగ్ కాబట్టి అలా పిలవద్దని తన భర్తకు చెప్పినట్లు తెలిపింది కియారా.

Next Story