మరో బడా ఆఫర్ దక్కించుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by sudharani |
మరో బడా ఆఫర్ దక్కించుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ కియారా అద్వానీ.. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 7 వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలు తీయదు అనుకున్న ఈ అమ్యడు.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ మధ్య ‘సత్య ప్రేమ కీ కథ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కియారా.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ తో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మరో ఆఫర్ అందుకుంది ఈ అమ్మడు.

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘డాన్ 3’. ఈ సినిమాలో కియారా నటించనున్నట్లు గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్ ఓ పోస్ట్ పెట్టాడు. ‘డాన్ 3 విశ్వంలోని కియారా అద్వానీకి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రంలో హీరోగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story