బాలీవుడ్ హీరోల్లో అతనొక్కడే గొప్ప మేధావి: Katrina Kaif (కత్రినా కైఫ్

by sudharani |
బాలీవుడ్ హీరోల్లో అతనొక్కడే గొప్ప మేధావి: Katrina Kaif (కత్రినా కైఫ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ చాలా తెలివైనవాడంటూ ప్రశంసలు కురిపించింది కత్రినా కైఫ్. రీసెంట్‌గా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్స్‌తో కలిసి పని చేసినప్పటికీ షారుఖ్ తెలివితేటలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పింది. 'జబ్ తక్ హై జాన్', 'జీరో' సినిమాల్లో తనతో కలిసి పనిచేసిన నటి.. ఆయనకు ఎవరూ ఊహించలేనంత పరిజ్ఞానం ఉందని తెలిపింది. 'షారుఖ్ చాలా జ్ఞానవంతుడు. అతడు మాట్లాడటం వింటే ఓ మేధావితో డిస్కస్ చేసినట్లే ఉంటుంది. నేను చూసిన అతి తక్కువ మంది తెలివైన వాళ్లలో ఆయన ఒకడు' అని చెప్పింది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన 'ఫోన్ బూత్' చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.

Next Story