అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. నా సినిమా కోసం నేను అదే చేశా.. ఓపెన్ గా మాట్లాడిన కస్తూరి..

by Dishafeatures3 |
అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. నా సినిమా కోసం నేను అదే చేశా.. ఓపెన్ గా మాట్లాడిన కస్తూరి..
X

దిశ, సినిమా: సీనియర్ నటి కస్తూరి తెలుగుతోపాటు తమిళ్, మలయాళం సినిమాలు కూడా చేసింది. అక్కడ కూడా బాగానే పాపులారిటీ సంపాదించింది. బోల్డ్ కామెంట్స్ తో వివాదాలకు కూడా సై అంది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రతి ఒక్క నటి ఏదో ఒక ఫేజ్ లో సెక్సువల్ అబ్యూజ్ కచ్చితంగా ఫేస్ చేసి ఉంటుందని.. కానీ కొంతమంది మాత్రమే ఓపెన్ అవుతారని తెలిపింది. ప్రతి రంగంలో ఇది కామన్ అంటూ ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదహరించింది.

తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని అసలు విషయం చెప్పేసింది. టాలీవుడ్ లో ఆ అనుభవం లేదు కానీ కోలీవుడ్, మాలీవుడ్ లో ఎదుర్కొన్నట్లు చెప్పింది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ అని.. తన కమ్ బ్యాక్ సినిమా ఫైనల్ అయినప్పుడు, అంతా ఓకే అనుకున్న సమయంలో తనతో పడుకోమని డైరెక్టర్ కోరాడని తెలిపింది. కానీ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వివరించింది. అయితే మాలీవుడ్ ప్రస్తుతం పూర్తిగా చేంజ్ అయిందని చెప్పుకొచ్చింది కస్తూరి.

Next Story

Most Viewed