హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న 'కార్తికేయ 2'

by Disha Web Desk 7 |
హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న కార్తికేయ 2
X

దిశ, సినిమా : యంగ్‌ హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'కార్తికేయ2'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శనివారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మేరకు విడుదలైన తొలి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు, బాలీవుడ్‌ సహా యూఎస్‌లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక బీటౌన్‌లో విడుదల రోజు కేవలం రూ.7 లక్షలు వసూలు చేయగా.. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే రెండో రోజు రూ. 28 లక్షలకు, మూడో రోజుకు రూ.1.10 కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్.. 'హిందీలో సరదాగా 50 థియేటర్లలో విడుదల చేస్తే.. రెండో రోజుకు ఆ సంఖ్య 200కి చేరింది. ప్రస్తుతానికి 'కార్తికేయ2' హిందీలో 700 థియేటర్లలో ఆడుతోంది. అంటే ఈ చిత్రం లాంగ్వేజ్ బారియర్స్‌ను అధిగమించి మరీ సత్తా చాటుతోంది' అన్నారు. కాగా తన సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు హీరో నిఖిల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed