- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వంటలక్క, డాక్టర్ బాబు ఈజ్ బ్యాక్.. పాత్రలు అవే.. కానీ కథ కొత్తది.. (ప్రోమో)

దిశ, సినిమా: స్టార్ మా లో ‘కార్తీక దీపం’ సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటోంది. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ నాటికలో ప్రతి ఒక్కరు బాగా నటించారు అనే కంటే.. ఒక్కొక్కరు జీవించారని చెప్పుకోవచ్చు. దీంతో 2017 అక్టోబర్ 16 న ప్రారంభిమైన ఈ దారవాహిక 2023 జనవరి 23 వరకు కొనసాగి కొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాదు ఈ సీనియల్‌కు అప్పుడే సుభం కార్డు వేయడంతో.. సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. అప్పుడే ఎందుకు ఆపేశారంటూ డైరెక్టర్‌ని తిట్టనివారుండరు అంటే అతిశయోక్తి లేదు. అయితే.. ఇటీవల ఈ సీరియల్ సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో శౌర్య అనే చిన్న పిల్ల క్యారెక్టర్ రివీల్ చేస్తూ.. ‘‘కార్తీక దీపం’ ఇది నవ వసంతం’’ అని చిన్న ప్రోమో వదిలారు.
అప్పుడు ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికి మొదలయ్యే డౌట్.. మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు ఉంటారా..? అని. అయితే.. వాళ్ల ఆశలే నిజం అయ్యాయి. ఈ సారి వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు సైతం రివీల్ చేస్తూ మరో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మొదట డాక్టర్ బాబు మొట్లు దిగుతూ వస్తుంటాడు. అప్పుడు శౌర్య వాళ్ల నాన్న గురించి చెప్తూ ఉంటోంది. ఇంతలో డాక్టర్ బాబు వచ్చి.. ‘మీ నాన్న ఎవరో తెలియదు అన్నావు.. ఇప్పుడు అన్నీ మీ నాన్నే అంటున్నావు’ అని అడగ్గా.. సౌర్య తల్లైనా తండ్రైనా అన్నీ మా అమ్మే అన్నట్లుగా.. వంటలక్కను చూపిస్తుంది. అయితే.. ఈసారి డాక్టర్ బాబు అని కాకుండా.. బాబు గారు అని పిలిచింది దీప. చూడాలి మరి ఈ కథలో ఎన్ని మలుపులు ఉంటాయో.
Karthika Deepam - Promo | New Serial | StarMaaSerials | Coming Soon only on Star Maa.#StarMaaSerials #StarMaa#KarthikaDeepam pic.twitter.com/L9FbrqAQxB
— Starmaa (@StarMaa) February 25, 2024