ఆ హీరోయిన్‌తో కార్తీక్ ఆర్యన్ డేటింగ్.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో!

by Hamsa |
ఆ హీరోయిన్‌తో కార్తీక్ ఆర్యన్ డేటింగ్.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సొంత టాలెంట్‌తో హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పలు సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కార్తీక్ నటించిన మూవీ చందు చాంపీయన్ థియేటర్స్‌లో జూన్ 14న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా కార్తీక్ ఓ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో డేటింగ్ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘ గత కొద్ది కాలంగా నేను ఓ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్యాయి. ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే దీనిపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎవరితోను రిలేషన్‌లో లేను. సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత బయట కూడా భయంభయంగా తిరుగుతున్నాను. నా స్నేహితులను కూడా తక్కువగా కలుస్తున్నాను.

చాలా మంది నన్ను రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటారు. కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ దురదృష్ణవంతుడినే. డబ్బు, పాపులారిటీ వచ్చిన తర్వాత వస్తువులను కొనుక్కోగలం. కానీ ప్రేమను మాత్రం కొనలేం. అందుకే నా జీవితంలోకి సరైన వ్యక్తి వస్తారని ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారంతా అతనికి ఏమైనా బ్రేకప్ అయ్యాయా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.Next Story

Most Viewed