- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘హనుమాన్ 2’లో హనుమంతుడిగా కన్నడ సూపర్ స్టార్..

దిశ, సినిమా: సంక్రాంతి బరిలో దిగి ఇప్పటికీ అంతే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషించారు.ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ విజయఢంకా మోగించిన ఆ మూవీ ఇప్పటికే 300 సెంటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుంది, ఇంకా నడుస్తుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ వస్తుంది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ క్లైమాక్స్ లో కూడా కన్ఫర్మ్ చేశారు.
అయితే మరి ఇందులో నటినటులు ఎవరు.. ముఖ్యంగా హనుమంతుని పాత్ర, రాముని పాత్రలో ఎవ్వరు కనిపించబోతున్నారు అనే ఆసక్తి మొదలైంది. ఇక తాజాగా ‘కేజీఎఫ్’ మూవీ కన్నడ నటుడు యష్ ఈ ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడిగా నటిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. కానీ దీనిపై ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘ ‘జై హనుమాన్’ లో హనుమంతుని పాత్రకి యష్ కరెక్ట్ గా సూట్ అవుతాడు’ .. ‘ఇది కనుక నిజం అయితే పెద్ద సినిమా అవ్వడం ఖాయం’ అని అంటున్నారు నెటిజన్లు.