రజినీకాంత్ అనారోగ్యంపై స్పందించిన కమల్ హాసన్

by M.Rajitha |
రజినీకాంత్ అనారోగ్యంపై స్పందించిన కమల్ హాసన్
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సోమవారం తీవ్ర అనారోగ్యం పాలయ్యి చెన్నై(Chennai)లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. దానికి స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా రజినీకాంత్ అనారోగ్యంపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'నా ప్రియమైన మిత్రుడా.. మీరు త్వరగా కోలుకోవాలి' అంటూ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు కమల్. కాగా రజినీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన భార్య లత మీడియాకు వెల్లడించారు. రజినీకాంత్ అనారోగ్యం గురించి తెలిసి ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Next Story