ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతున్న కల్కి 2898 ఏడి.. పోస్ట్ వైరల్!

by Hamsa |
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతున్న కల్కి 2898 ఏడి.. పోస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి2898ఏడి’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీలో అగ్రహీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే దీపికా పదుకొణె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు నటించారు. అయితే కల్కి మూవీ జూన్ 27న థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా రూ. 1050 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

కానీ కల్కి ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డే్ట్ విడుదల కాలేదు. ఈ క్రమంలో.. కల్కి ఏడి ఓటీటీలోకి రాబోతున్నట్లు ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎడిట్ చేసిన పోస్టర్ ఏకంగా రెండు ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్-నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 23నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఉంది. ఇక అది చూసిన వారంతా నిజమే అనుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ అలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కల్కి ఏడి ఆగస్టులో వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

(Video Link Credits to prabhaswarriors Instagram Channel)

Advertisement

Next Story