'ధగడ్ సాంబ' చిత్రంలో భిన్నంగా కనిపించనున్న సంపూర్ణేష్ బాబు..

by Disha Web Desk 17 |
ధగడ్ సాంబ చిత్రంలో భిన్నంగా కనిపించనున్న సంపూర్ణేష్ బాబు..
X

దిశ, సినిమా: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'ధగడ్ సాంబ' మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. కొబ్బరిమట్ట, సింగం 123, పెదరాయుడు కామెడీ సినిమాల్లో నటించిన సంపూర్ణేష్ బాబు.. తొలిసారి సీరియస్‌గా ఉండే భిన్నమైన యాక్టింగ్ చేశానని అన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన 'ధగడ్ సాంబ' టీజర్, పాటలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. 'ఒక సమస్యతో చిన్నప్పుడే ఆస్తిని కోల్పోయిన వ్యక్తి తిరిగి ఎలా సంపాదించాడు..? అన్యాయాన్ని ఎలా అరికట్టాడు..?' అనే అంశాలు ఆకట్టుకుంటాయని తెలిపాడు. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందన్నారు. 'బ్రిలియంట్ బాబు', 'సన్నాఫ్ తెనాలి', 'దాన వీర శూర కర్ణ', 'మిస్టర్ బెగ్గర్' సినిమాలతో పాటు ఒక తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నట్లు తన అప్ కమింగ్ సినిమాల గురించి వివరించారు.


Next Story