‘క‌బ్జ’ ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్.. ఒకటనుకుంటే మరొకటైంది

by Disha Web |
‘క‌బ్జ’ ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్.. ఒకటనుకుంటే మరొకటైంది
X

దిశ, సినిమా: ఉపేంద్ర హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘క‌బ్జ’. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో క‌న్నడ‌, తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లో శుక్రవారం రిలీజైంది. కలెక్షన్ల విషయానికొస్తే తొలిరోజు అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ.13 కోట్ల క‌లెక్షన్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఫస్ట్ డే క‌న్నడ వెర్షన్‌లో రూ. 9 కోట్లకుపైగా క‌లెక్షన్స్ ద‌క్కించుకోగా.. హిందీలో కోటిన్నర క‌లెక్షన్స్ రాబట్టింది. తెలుగు,తమిళ, వెర్షన్‌‌లో మరో కోటి కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మూవీ టీమ్ రూ.35 కోట్ల కలెక్షన్ టార్గెట్ అనుకున్నప్పటికీ కేవలం రూ.13 కోట్లు మాత్రమే వచ్చాయి.

Also Read...

విశ్వక్ దర్శకత్వం ఆపేయ్.. తారక్ కామెంట్స్ వైరల్Next Story