ఈ ముగ్గురు లెజెండ్స్ అన్నదమ్ములేనట!

by Hajipasha |
ఈ ముగ్గురు లెజెండ్స్ అన్నదమ్ములేనట!
X

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన నటులు కే. విశ్వనాథ్, చంద్రమోహన్, గాయకుడు బాలసుబ్రహ్మణ్యంల గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముగ్గురు లెజెండ్స్ పరిశ్రమలోకి వచ్చేదాకా వాళ్లంతా బంధువులనే విషయమే తెలియదట. చంద్రమోహన్, విశ్వనాథ్ చెన్నైలో పక్కపక్కనే ఇళ్లు కట్టుకొని నివసించినప్పటికీ ఈ ముగ్గురు వరుసకు అన్నదమ్ములనే విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అయితే విశ్వనాధ్ తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య చెల్లెలి కొడుకు చంద్రమోహన్. కాగా చంద్రమోహన్ బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం అన్న పెళ్లి చేసుకున్నాడట. ఇలా బంధువులైనా ఈ ముగ్గురు వరుసకు సోదరులవుతారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి : రేపు సినిమా చూడాలనుకునే మహిళలందరికీ గుడ్ న్యూస్

Next Story