నువ్వు ఇచ్చే హగ్స్, కిస్సులతో జీవితం సంపూర్ణమైంది .. అతడిపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన జగతి మేడం

by Disha Web Desk 6 |
నువ్వు ఇచ్చే హగ్స్, కిస్సులతో జీవితం సంపూర్ణమైంది .. అతడిపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన జగతి మేడం
X

దిశ, సినిమా: తమిళ బుల్లితెర నటి జ్యోతిరాయ్ పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తెలుగు ‘గుప్పెడంత మనసు’ టీవీ సీరియల్ ద్వారా పరిచయం అయింది. ఇందులో సంప్రదాయం ఉట్టిపడేలా చీరలో కనిపించి అందరి మనసులు దోచేసింది. జగతి మేడం గా కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే జ్యోతిరాయ్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ఇంతకు ముందే పెళ్లై కొడుకు ఉండగానే భర్తతో విడిపోయింది.

ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో జ్యోతీ రాయ్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాకుండా ఓ వెబ్‌సిరీస్‌తో తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల ఓ షాకింగ్ పోస్టర్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, ఆమె భర్త సుకు పూర్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ‘‘మనం కలిసి ఏడాది అయింది. నా జీవితం మొత్తం మారిపోయింది.. నాకు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను.

నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికీ థాంక్స్.. నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్.. నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది.. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్ యూ అన్ కండీషనల్లీ’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Read More : ‘పుష్ప2’ లో ఐటమ్‌ సాంగ్‌కి మొస్ట్ వాంటెడ్ బ్యూటీ ఫిక్స్.. ఆమె ఎవరో తెలుసా

Read Disha E-paper

Next Story

Most Viewed