- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇన్నాళ్లకు సరైన దర్శకుడితో Jr.NTR సినిమా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? అని అడిగితే సినిమాల గురించి అవగాహన ఉన్న ఎవరైనా టక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో, సినిమా ఫంక్షన్లలో దర్శకులు సైతం అనేకసార్లు చెప్పడం మనం చూశాం. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో 'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పాట పూర్తయ్యేలోపు అనేకమంది అభిమానుల థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మల్టీస్టారర్ సినిమా కావడంతో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా అదరగొట్టారు. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళిని మించి ఎన్టీఆర్‌ను వాడుకునే మంచి టాలెండెట్ డైరెక్టర్ దొరికాడని, అతనితో సినిమాకు ఎన్టీఆర్ సైతం ఓకే చెప్పాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. తారక్‌కు ఆయన మూడు కథలు వినిపించారని సమాచారం. ఎన్టీఆర్ సైతం స్క్రిస్ట్ ఎంపిక చేసుకున్నారని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. మొదటి పార్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే, రెండో పార్ట్‌లో ఎన్టీఆర్‌తో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ నటించనున్నారని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు వినూత్న సినిమాలో వెండితెరపై సత్తా చాటారు డైరెక్టర్ వెట్రిమారన్. 'విసారణై', 'అసురన్', 'వడ చెన్నై' చిత్రాలన్నీ ఆ కోవకు చెందినవే. ఈ సినిమాలతో వెట్రిమారన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం సూర్యతో 'వడి వాసల్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నట్టు సమాచారం.