వాళ్లను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.. స్టార్‌కిడ్స్‌ పనితీరుపై నటి ప్రశంసలు

by sudharani |
వాళ్లను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.. స్టార్‌కిడ్స్‌ పనితీరుపై నటి ప్రశంసలు
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్, సుహానా ఖాన్ లాంటివారు నిజంగా చాలా కష్టపడుతున్నారంటోంది జుహీ చావ్లా. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వినోద పరిశ్రమలో పనిచేస్తున్నందువల్ల అనేక మంది నటులు, చిత్రనిర్మాతల పిల్లలు పరిశ్రమలోకి ప్రవేశించగా.. వాళ్లు ఎదిగిన తీరును దగ్గర నుంచి గమనించానని చెప్పింది.

అలాగే తన కళ్లముందు పుట్టిన పసిపిల్లలు సినిమా తారలుగా ఎదగడం చూసినపుడు ఎంతో ముచ్చటేస్తుందన్న నటి.. 'సుహానాతో పాటు చాలా మంది సెలబ్రిటీల పిల్లలు నా ముందే పెరిగారు. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు నిజంగా అందరూ కష్టపడి పని చేస్తున్నారు. స్టార్ కిడ్ అనే భావనతో కెరీర్‌ను తేలిగ్గా తీసుకోరు. నిబద్ధతతో పనిచేసే తీరును సెట్స్‌లోకి వెళ్లినప్పుడు గమనించాను. చూడటానికి ఎంతో అందంగా ఉంది. కానీ ఇందులో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పలేను. ఈ పిల్లలందరూ ఎదగాలనే కోరుకుంటాను' అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించింది.

Next Story