‘జైలర్’ సినిమా యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
‘జైలర్’ సినిమా యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రం ‘జైలర్’. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ భారీగా రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆర్టిస్టులను, టెక్నిషియన్స్ ని ఎలా గౌరవించాలో కళానిధి మారన్ కి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన సినిమా హిట్ అవుతుందని చెప్తూనే ఉన్నారు. సినిమా రీ రికార్డింగ్ ముందు కళానిధి అక్కడ ఉన్న కొంతమందిని సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుంది, హిట్ అవుతుందని చెప్పారు. ఇంకొకరు యావరేజ్ అన్నారు. నిజం చెప్పాలంటే జైలర్ సినిమా నాకు కూడా ఎబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ రీ రికార్డింగ్ మొత్తం అయ్యాక, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అనిరుధ్ నా కొడుకు లాంటి వాడు. నాకు హిట్ ఇచ్చాడు. అతని ఫ్రెండ్ నెల్సన్ కి హిట్ ఇచ్చాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed