టాలీవుడ్ స్టార్ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం.. సీక్రెట్ రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్!

by Disha Web Desk 6 |
టాలీవుడ్ స్టార్ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం.. సీక్రెట్ రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయి ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న వారిలో నటి రోహిణి ఒకరు. ఆమె పలు టీవీ షోస్‌లోనూ పాల్గొని తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించి తన క్రేజ్ పెంచుకుంటుంది. ఇక ఇప్పుడు రోహిణి టాలీవుడ్ హీరో గోపీచంద్ భీమా సినిమాలో నటించింది. హర్ష దర్శకత్వం వహించగా.. కేకే రాధామోహన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.

ఈ క్రమంలో.. తాజాగా, భిమా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోకు వచ్చారు. హీరో గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, రోహిణి, నిర్మాత కేకే రాధామోహన్ షోలో పాల్గొన్నారు. ఇందులో సుమ ప్రొడ్యూసర్ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉందని అడిగింది. దానికి రోహిణి.. నన్ను కూడా అడగండి అనడంతో.. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని సుమ ప్రశ్నించింది. దీంతో రోహిణి.. ‘‘ నాకు క్రష్ ఉన్నాడు. నాకోసం రాధామోహన్ నా స్కూల్, కాలేజీ రోజుల్లో నా వెంట పడి తిరిగే వాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయనతో కలిసి డాన్స్ స్టెప్స్ కూడా వేసింది. ఇదంతా షోలో భాగంగా రోహిణి కామెడీ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్‌లో లవ్ ట్రాక్ అనడంతో రోహిణి కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్ మారాయి. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది.Next Story

Most Viewed