- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా కెరీర్‌ని పాడు చేసుకోలేను.. అంటూ విజయ్ తో సినిమాకు నో చెప్పిన ఇవానా..

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ ప్రజంట్ వరుస చిత్రాలతో ధూసుకుపొతున్నాడు.అయితే సాధారణంగా విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. అందులోను ఇప్పుడిప్పుడే గుర్తింపును సొంతం చేసుకుంటున్న హీరోయిన్ లు అయితే, కథ కూడా వినకుండా ఎస్ చెప్పేస్తారు. కానీ తాజాగా యంగ్ హీరోయిన్ ఇవానా మాత్రం విజయ్ మూవీకి నో చెప్పింది.
‘లవ్‌టుడే’ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇవానా. హీరోయిన్ గా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఇవానాకు ఈ సినిమాలో విజయ్‌కు చెల్లిగా నటించే అవకాశం వచ్చిందట. కానీ ఇవానాకు విజయ్‌తో నటించాలని ఆసక్తి ఉన్నప్పటికి చెల్లిగా నటించడం వల్ల.. హీరోయిన్ ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని భావించి ఇవానా నో చెప్పికట్లు తెలుస్తోంది. కాగా ఇవానా రిజెక్ట్ చేసిన రోల్ లో మోడల్, నటి అభియుక్త నటించనుందట.