- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Thalapathy 69 Cast Reveal : ‘విజయ్69’లో హీరోయిన్, విలన్ ఫిక్స్
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు తన 69వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యగా.. నెట్టింట మంచి స్పందన లభించింది.
ఇదిలా ఉంటే.. ‘విజయ్ 69’ నటించే నటీనటుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. కానీ, ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే, విలన్‌గా బాబీ డియోల్ నటించబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే వార్తలను నిజం చేస్తూ.. అదిరిపోయే పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘విజయ్ 69’లో పూజా హెగ్డే, బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇవి నెట్టింట వైరల్ కావడంతో.. లేట్ అయినా మంచి హీరో పక్కనే చాన్స్ అందుకుంది బుట్టబొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.