ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.. అందరికి కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్

by sudharani |   ( Updated:2024-10-08 15:02:10.0  )
ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.. అందరికి కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్
X

దిశ, సినిమా: వెర్సటైల్ యాక్టర్ సుహాస్‌, సంగీర్తన జంటగా నటిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తాజాగా మీడియాతో ముచ్చటించి.. సినిమా విశేషాలను పంచుకున్నారు.

‘జ‌న‌క అయితే గ‌న‌క‌’ టైటిల్ మీనింగే తండ్రి అయితే ఏంటి అనేదే!. ఇప్పటి జ‌న‌రేష‌న్‌లో పెళ్లైన కొత్త జంట ఓ పాప‌నో, బాబునో క‌న‌టానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితులేంటి? అనే విష‌యాన్ని మ‌ధ్య త‌ర‌గ‌తి నేప‌థ్యంలో తీసుకుని సినిమాగా చిత్రీక‌రించాం. రీసెంట్‌గా ప్రీమియ‌ర్ షోస్ వేసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీకి చెందినవారు, సామాన్య ప్రజ‌లు అంద‌రూ చూశారు. పాతికేళ్ల లోపు వాళ్లు, మ‌ధ్య వ‌య‌స్సున్నవాళ్లు, వ‌య‌సు మ‌ళ్లిన వాళ్లు సినిమాను చూశారు. అంద‌రి ద‌గ్గరి నుంచి పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. ఇందులో ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు పెట్టడం అనేది డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. తెలుగు ఆడియెన్స్ దేవుళ్లు. ఈ విష‌యాన్ని ప్రశాంత్ నీల్‌గారు కూడా చాలా సార్లు చెప్పారు. సినిమా కంటెంట్ బావుంటే తెలుగులో సినిమాలు సూప‌ర్ హిట్. మా సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్లకు న‌చ్చే సినిమా ఇది. ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కి వెళ్లిన‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ వ‌స్తుందో ఈ సినిమా చూసిన‌ప్పుడు అలాంటి ఫీలింగే వ‌స్తుంది. మ‌న లైఫ్‌లో చాలా ఫ్రస్టేష‌న్స్ ఉంటాయి. వ‌చ్చి సినిమా చూసి, స‌ర‌దాగా న‌వ్వుకుని, అక్కడ‌క్కడ ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story