అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు అని నాన్న అనడం చాలా తప్పు.. రవిబాబు

by Kavitha |
అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు అని నాన్న అనడం చాలా తప్పు.. రవిబాబు
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు చలపతిరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇంత మంచి ఆదరణ పొందిన చలపతిరావు ఇండస్ట్రీలో జరిగిన ఒక పెద్ద వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చలపతిరావు అమ్మాయిలు పక్కలో పడుకోవడానికే పనికొస్తారు అని నోరు జారడం వలన ఆయన చనిపోయే వరకు ఎన్నో విమర్శలకు గురి కావాల్సి వచ్చింది.

కాగా ఆయన చనిపోయే ముందు ఈ మాటల వలన ఎవరైనా బాధపడితే క్షమించమని కూడా కోరారు. ఇక ఈ వివాదంపై చలపతిరావు కుమారుడు, డైరెక్టర్ రవిబాబు ఇప్పటివరకు నోరు మెదిపింది లేదు. అప్పట్లో రవిబాబు మాట్లాడినట్లు వార్తలు వచ్చినా అవేమి నిజం కాదని ఆయన స్పష్టం చేశాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నాన్న వివాదం గురించి నేనెప్పుడు మాట్లాడలేదు. కానీ, కొంతమంది నేను మాట్లాడినట్లు యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టారు. అయితే ఆ వివాదం జరిగినప్పుడు మాత్రం నాన్నతో మాట్లాడాను. మీరు అలా మాట్లాడటం తప్పు. మీరు మాట్లాడిన మాటలు ఇతరులను నొప్పించి ఉంటే సారీ చెప్పడం మీ బాధ్యత అని చెప్పాను. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారు. మనమందరం ఎప్పుడో ఒకసారి నోరు జారేస్తాం.. లూజ్ గా మాటలు వదిలేస్తాం. కానీ, అది తెలుసుకొని సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు అలా నోరు జారడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పి ఆ టాపిక్ ను అక్కడితో అయిపొయింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story

Most Viewed