నువ్వు ఆ పని చేయడం మంచిది కాదు.. జగపతిబాబుపై పూనమ్ ట్వీట్

by Hamsa |
నువ్వు ఆ పని చేయడం మంచిది కాదు.. జగపతిబాబుపై పూనమ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జగపతి బాబు ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం జగపతి బాబు అడపా దడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో పలు ఫొటోస్ షేర్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన బార్బీ లుక్ లో ఫోటోలను షేర్ చేశాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. తన ఫోటోలన్నింట్లోకెల్లా ఆ బార్బీ లుక్కుకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. అందుకే థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు జగ్గూ భాయ్. తాజాగా, దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘జగ్స్ ఏంటి ఈ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం అందరికీ.. మంచిది కాదు అంటూ ఫన్నీగా కౌంటర్ వేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed