'సూర్యాపేట్ జంక్షన్'.. ఆకట్టుకుంటున్న యదార్థ కథ టీజర్!

by Disha Web Desk 17 |
సూర్యాపేట్ జంక్షన్.. ఆకట్టుకుంటున్న యదార్థ కథ టీజర్!
X

దిశ, సినిమా: ఈశ్వర్, నైనా సర్వర్ కలయికలో వస్తున్న చిత్రం 'సూర్యాపేట్ జంక్షన్'. నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో యోగా లక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్‌లు సంయుక్తంగా నిర్మించిన సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన వారు.. టీజర్ చూసిన మీడియా మిత్రులు, ఫ్రెండ్స్ బాగుందని చెబుతుంటే కష్టానికి ఊపిరి పోసినట్లు అనిపించిందన్నారు. అలాగే డైరెక్టర్‌తోపాటు సపోర్టుగా నిలిచిన టీమ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక యదార్థ కథతో వస్తున్న మూవీలో ఆర్టిస్టులంతా కష్టపడి పనిచేశారని, సమిష్టి కృషి వల్లే అనుకున్నదానికంటే మెరుగ్గా అవుట్‌పుట్ వచ్చిందన్నారు. చివరగా ఈ చిత్రం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నానన్న హీరో.. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేయాలని, అందరికీ థాంక్స్ చెప్పాడు.


Next Story

Most Viewed