సామ్‌ను ప్రేమించడానికీ ఇదే కారణమట? చైతూ మాటలు వైరల్..

by Anjali |
సామ్‌ను ప్రేమించడానికీ ఇదే కారణమట? చైతూ మాటలు వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్‌ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నవారిలో నాగచైతన్య సమంత ఒకరు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందనుకునే ఈ జంట మధ్యలోనే విడిపోయింది. అయితే నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర ప్రమోషన్ కోసం వీరు ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోలో చైతూను యాంకర్ ఓ ప్రశ్న అడిగింది.

‘‘ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా మీరు సామ్‌నే ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? దీనికీ చై వెంటనే సమంతకు ఫోన్ చేసి.. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించాను’ అని అడుగుతాడు. దానికి సమంత ‘ ఎందుకంటే నేను నీకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అంటూ సామ్ నవ్వుతూ బదులిస్తుంది. ‘నువ్వు ఇంకో ఆప్షన్ ఇచ్చినా నేను తీసుకోలేను అంటూ ఈ హీరో సమాధానం ఇస్తాడు. దీంతో సామ్ ఐ ల్ యు అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు.Next Story

Most Viewed