డైరెక్టర్ సందీప్ వంగ.. 'యానిమల్'తో మరో అద్భుతం చేసేలా ఉన్నాడే !

by Disha Web |
డైరెక్టర్ సందీప్ వంగ.. యానిమల్తో మరో అద్భుతం చేసేలా ఉన్నాడే !
X

దిశ, సినిమా : 'అర్జున్ రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగ.. అదే సినిమాను బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' టైటిల్‌తో తెరకెక్కించి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తన మొదటి సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ విమర్శకుల నుంచి ఎదురైనపుడు 'అసలు వయొలెన్స్ అంటే ఏంటో నెక్ట్స్ సినిమాలో చూపిస్తాను' అని సందీప్ స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 'యానిమల్' నుంచి తాజాగా రిలీజ్ చేసిన రణ్‌బీర్ పిక్ చూస్తుంటే.. సందీప్ గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. షర్ట్‌పై రక్తపు మరకలతో కనిపించిన రణ్‌బీర్ సీరియస్ లుక్ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed