ఆ డైరెక్టర్ తో నాగార్జున మీటింగ్ అఖిల్ కోసమేనా ?

by Prasanna |
ఆ డైరెక్టర్ తో నాగార్జున మీటింగ్ అఖిల్ కోసమేనా ?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పేరునే సినిమా టైటిల్ గా మార్చుకుని హీరోగా పరిచయమయ్యాడు కానీ, ఆ మూవీ ఫ్లాప్ అయింది. సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాలేదు. ఆ తర్వాత హలో మూవీతో వచ్చాడు ఈ మూవీ యావరేజ్ గా నిలిచిచింది. మిస్టర్ మజ్ను తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఇది ఫ్లాప్ గా నిలిచింది. కొంత కాలం గ్యాప్ తీసుకుని ఏజెంట్ తో వచ్చాడు.. ఈ మూవీ అఖిల్ కెరియర్లో అతి పెద్ద డిజాస్టర్ అయింది.

ట్యాలెంటెడ్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా కూడా అఖిల్ ని బయటకు తీసుకురాలేకపోయింది. ఇన్ని అపజయాలు చూసిన అఖిల్ తన తర్వాత ప్రాజెక్ట్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు కొడుకు కోసం నాగార్జున రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. మంచి కథను ఎంచుకుని ఎలా అయినా అఖిల్ కు ఒక మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ డైరెక్టర్ మురళీ కిశోర్‌ కొత్త కథను నాగ్ కి చెప్పి, ఒప్పించినట్లు సమాచారం.

ఈ కథ అఖిల్‌కు సెట్ అవుతుందని ఈ ప్రాజెక్ట్‌పై నాగ్‌ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్మించేందుకు ఓకే చెప్పారు . ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దీ రోజుల్లోనే దీనికి సంబందించి క్లారిటీ అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed