హీరోయిన్ నమిత భర్తతో విడాకులు తీసుకోబోతుందా.. బయటపడ్డ అసలు నిజాలు

by Hamsa |
హీరోయిన్ నమిత భర్తతో విడాకులు తీసుకోబోతుందా.. బయటపడ్డ అసలు నిజాలు
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మోడల్‌గా వచ్చినప్పటికీ జెమిని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రభాస్ బిల్లా, బాలయ్య సింహా సినిమాలతో అమ్మడు రేంజ్ భారీగా పెరిగిపోయింది. కానీ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు.

ఈ అమ్మడు సినిమాలకు దూరమైనప్పటికీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో.. నమిత భర్తతో మనస్పర్థలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోవాలనుకుంటుందని పలు పుకార్లు షికార్లు చేశాయి. దీంతో చాలా మంది ఆమెను పలు ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘నా భర్తతో నేను విడాకులు తీసుకుంటున్నా అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆయనతో కలిసి దిగిన ఫొటోలు పెట్టినప్పటికీ ఇలాంటి న్యూస్ రావడమేంటో అర్థం కావడం లేదు.

ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. నటిగా నేను ఈ రంగంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రచారాలు నన్ను, నా భర్తను బాధపెట్టవు. విడాకులు రూమర్స్ చూసి ఫుల్ గా నవ్వుకున్నాం. మేమిద్దరం ఇంత సంతోషంగా ఉన్నా కానీ విడిపోతున్నామంటున్నారు. అదేం విచిత్రమో అర్థం కావడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం బీజేపీ పార్టీలో నమిత ప్రచారం చేస్తోంది.

Next Story

Most Viewed