‘దేవర’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఖుష్ అవుతోన్న NTR ఫ్యాన్స్..!

by Disha Web Desk 11 |
‘దేవర’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఖుష్ అవుతోన్న NTR ఫ్యాన్స్..!
X

దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న రెండో సినిమా దేవర. ఈ సినిమాలో తండ్రి, కొడుకుగా డ్యుయల్ రోల్‌లో తారక్ నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌తో జోడీ కట్టగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేవర టీజర్‌పై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. దేవర టీజర్‌ను ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక, యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed