- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సూర్య సినిమా సెట్‌లో డైరెక్టర్ బాలా వేధింపులు.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టిన హీరోయిన్

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మమితా బైజు ఇటీవల ప్రేమలు సినిమాతో భారీ హిట్ అందుకుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల హీరో సూర్య, డైరెక్టర్ బాలా సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం డైరెక్టర్ కొట్టడం వల్ల అని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ప్రస్తుతం మమితా బైజు కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది.
తాజాగా, మమితా బైజు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించి తనపై వస్తున్న వార్తలపై ఫైర్ అయింది. ‘‘ హలో ఎవ్రీ వన్ నా గురించి తమిళ ఇండస్ట్రీలో వస్తున్న వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అవన్నీ అబద్ధాలు. డైరెక్టర్ బాలా విల్లాడిచం పాట చేయాలని కోరారు. ఆ సమయంలో నేను సరిగ్గా నటించేందుకు నన్ను కోప్పడటంతో నేను మూడు షాట్స్ తీసుకుని అద్భుతంగా నటించాను. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకుని కొన్ని మీడియా ఛానల్స్ ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టి వార్తలు రాశారు. నేను బాలా సార్‌తో ప్రొడక్షన్ పనుల కోసం వర్క్ చేశాను.
బెటర్ యాక్టర్ అయ్యేందుకు నాకు ఆయన ఎంతో సహాయం చేశారు. నేను సెట్‌లో డైరెక్టర్ బాలా నుంచి ఎలాంటి బెదిరింపులు చూడలేదు. ఎలాంటి మానసిక లేదా శారీరక వేధింపులను ఎదుర్కోలేదు. సూర్య సార్, బాలా సార్ సినిమా నుంచి నేను తప్పుకోవడానికి కారణం కేవలం అంతకు ముందు నేను ఒప్పుకున్న సినిమాలే. ప్రచురించే ముందు వార్తలను ధృవీకరించడానికి నన్ను సంప్రదించిన మీడియా సంస్థలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్స్’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం మమితా బైజు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.